కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆర్ఎంపీ వైద్యులు కలిశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లె గ్రామంలో గ్రామీణ వైద్యులు ప్రతిపక్ష నేతను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో తమకు మేలు జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.