గ్రామీణ వైద్యులకు గుర్తింపు లేదన్నా..

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను గ్రామీణ వైద్యులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.ఆర్‌ఎంపీ డాక్డర్లకు ఎగ్జామ్‌ పెట్టి సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు.వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజా సంక్షేమం గురించే నిరంతరం ఆలోచించేవారని, ఆయన బాటలో వైయస్‌ జగన్‌ నడుస్తున్నారన్నారు.వైయస్‌ఆర్‌ హయాంలో గ్రామీణ వైద్యులకు గుర్తింపునిస్తూ ఎగ్జామ్‌ నిర్వహించడానికి టెక్కలి ఏరియా ఆసుప్రతిలో కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు ప్రతిపాదనలు చేశారన్నారు.సుమారు 80 శాతం పూర్తియ్యిందని, వైయస్‌ఆర్‌ మరణం అనంతరం.. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.వైయస్‌ జగన్‌ను కలిసిన తర్వాత మాకు తప్పకుండా చేస్తారనే నమ్మకం వుందన్నారు.ఆర్‌ఎంపీ,పిఎంపీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు.
Back to Top