శోభా నాగిరెడ్డికి ఘన నివాళి

కర్నూలు: వైఎస్సార్‌సీపీ తోబుట్టువు శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నివాళులు అర్పించారు. పార్టీకి, నియోజక వర్గ ప్రజలకు ఆమె చేసిన సేవల్ని కొనియాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లోని శోభా ఘాట్ దగ్గర శుక్రవారం ఉదయం ప్రథమ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం సర్వ మత ప్రార్థనల తర్వాత బీబీఆర్ స్కూల్ ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. 

సీనియర్ ఎమ్మెల్యే, శోభా నాగిరెడ్డి భర్త భూమా నాగిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకొన్నారు. ‘‘శోభ లేని లోటు తీరనిది. ఇలాంటి రోజు తన జీవితంలో ఉంటుందని ఊహించలేదు. ప్రస్తుతం నేను బతుకుతున్నది పిల్లల కోసమే. శోభ జీవితమంతా కష్టాలకు ఎదురీదింది. కుటుంబంలోని ప్రతీ ఒక్కరి యోగ క్షేమాలు తెలుసుకొంటూ ఆత్మీయంగా మెలగేది’’అని ఆయన అన్నారు. ఆమె భార్య మాత్రమే కాకుండా గొప్ప స్నేహితురాలు అని గద్గద స్వరంతో అన్నారు.  జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆమె జ్ఞాపకాల్ని, ప్రజా జీవితంలో ఆమె మైలురాళ్లను తలచుకొన్నారు. అనంతరం శోభా నాగిరెడ్డి కుమార్తె, ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ తల్లి జ్ఞాపకాల్ని అశ్రు నయనాలతో తలచుకొన్నారు. ‘‘వైఎస్ జగన్ సీఎం కావాలన్నదే అమ్మ కోరిక. ఆమె పదే పదే ఈ విషయం చెబుతుండేది. ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల పక్షాన పనిచేసేవారు. ఆమె మరణం తరవాత నేను ప్రజల్లోకి వెళితే నియోజక వర్గ ప్రజలు నాకు అదే ధైర్యం చెప్పారు. అమ్మ ఎప్పుడూ ఆళ్ల గడ్డ అభివృద్ధి కోసం ఆలోచించేవారు. నేను అదే స్ఫూర్తితో ముందుకు వెళతాను.’’అని అన్నారు. అనంతరం శోభా నాగిరెడ్డి కాంస్య విగ్రహాన్ని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి కి నివాళులు అర్పించారు. గత అసెంబ్లీలో తన కూడా ఆమె మెలగిన రోజుల్ని గుర్తు చేసుకొన్నారు. ‘‘నాలుగు సంవత్సరాలు నాతో నిరంతరాయంగా గడిపింది. ప్రతీ నిముషం నాతో ఉన్న సమయం అది. అక్కా అక్కా  అంటూ నాతో తిరుగుతూ ఉండేది. అమ్మ లేని లోటు తీరుస్తున్నావక్కా అని చెబుతూ ఉండేది. ఈ రోజు ఆమె లేని లోటు మాత్ర తీర్చలేనిది. ఈ రోజు నాకు మాటలు రావటం లేదు’’అని విజయమ్మ అన్నారు. తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ అంతటికి శోభా నాగిరెడ్డి తోబుట్టువు అంటూ ఉదహరించారు. ఒక అక్క మాదిరిగా తనను చూసుకొనేదని గుర్తు చేసుకొన్నారు. 
 ఆడపడుచుకు అశ్రు నివాళి

‘‘మండుతున్న ఎండల్లో కూడా ఇన్ని వేల మంది ఈ సభకు వచ్చారు అంటే అభిమానానికి ఎండలు, మండుటెండలు అడ్డు కావు అని అర్థం అవుతుంది. అభిమానం అంటే ఎండను కూడా ఖాతరు చేయకుండా తరలి రావటం అన్న మాట. మేమంతా నాగిరెడ్డి కుటుంబానికి, అఖిల ప్రియ కుటుంబానికి అండగా ఉంటామని అభిమానంతో తెలియచెప్పటానికి ఇన్ని వేల మంది తరలి వచ్చారు.  ఆమె పట్ల మీ అభిమానం గురించి వేరే చెప్పనక్కర లేదు. ఐదు సార్లు ఆమెను ఎన్నిక చేశారు. ఆమె ఎటువంటిదో వేరే చెప్పనక్కర లేదు. ప్రతీ విషయంలోనూ నేనున్నా తోడుగా అంటూ నియోజక వర్గ ప్రజలకు అండదండలు అందించే  వారు. ’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఆమె నాయకత్వ పటిమను ఆయన కొనియాడారు. 

‘‘ నాకు షర్మిల అనే చెల్లి ఉంది. నాకు శోభ అనే అక్క ఉండేది.’’అని ఆయన తలచుకొన్నారు.  శోభ నాగిరెడ్డి మనస్సుని ఆయన తలచుకొన్నారు. ‘‘నన్ను కొంత కాలం జైలులో పెట్టారు. ప్రజల్ని చూడనిచ్చేవారు కాదు. అప్పుడు ఒక సారి కోర్టుకి తీసుకొని వచ్చారు. ఆరోజు నాకు బాగా గుర్తు ఉంది. నన్ను చూడటానికి అమ్మ, భార్య కుటుంబ సభ్యులు వచ్చారు. అప్పుడు శోభక్క కూడా వచ్చింది. కళ్ల నీళ్లు పెట్టుకొంది. ఆమె కంట కన్నీరు నేను గమనించాను. ఎంతగా పరితపించి పోయేది అంటే ఒక అక్క ఒక తమ్ముని కోసం ఎంతగా పరితపించి పోతుందో అంతగా పరితపించిపోయింది.’’ అని ఆయన అన్నారు.
 అనంతరం శోభా నాగిరెడ్డి చేసిన సేవలు,  ప్రజా జీవితం మీద రూపొందించిన పాటల 

తాజా వీడియోలు

Back to Top