వైయ‌స్ఆర్‌సీపీ పోరాట ఫ‌లిత‌మే జీతాల పెంపు

చిత్తూరు(గంగాధరనెల్లూరు):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫ‌లితంగా జైన్‌ఫామ్ ప్రెష్ క‌ర్మాగారం కార్మికుల‌కు వేత‌నాలు పెరిగాయ‌ని ఆ సంఘం అధ్య‌క్షుడు క‌లిజ‌వేడు సుబ్ర‌మ‌ణ్యంరెడ్డి తెలిపారు. గురువారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ..మండలంలోని జైన్‌ఫామ్‌ప్రెష్ కర్మాగారంలో పని చేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు పెంచినట్లు వెల్ల‌డించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కొక్క ఉద్యోగికి రూ.4250 జీతం పెరిగిందన్నారు. రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి, వైయ‌స్ ఆర్ టీయూసీ గౌరవాధ్యక్షులు బీరేంద్రవర్మ, యూనియన్ సలహాదారుడు చిన్నమరెడ్డి కృషితో జైన్ యాజమాన్యంతో సంప్రతింపులు జరిపామన్నారు. ఎట్టకేలకు యాజమాన్యం జీతం పెంపున‌కు అంగీకరించిందన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు దుర్గాపతినాయుడు, రవిబాబు, విజయసారధి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి, జీతాల పెంపుకు కృషి చేసిన వైయ‌స్ఆర్‌టీయూసీ నాయకులకు కృతజ్ఙతలు తెలిపారు.  

Back to Top