బెల్టు షాపులు నిర్మూలించాలి

కుప్పంరూరల్‌: కుప్పం నియోజక వర్గంలో  బెల్టు షాపులు లేకుండా చూడాలని కుప్పం వైయఎస్సార్‌సీపీ సమన్వయ కర్త చంద్రమౌళి కోరారు. సోమవారం ఉదయం ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని కార్యకర్తలు, నాయకులతో కలిసి కుప్పం ఎక్సైజ్‌ పోలీసులకు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుప్పం నియోజకవర్గం గత ఏడు సంవత్సరాలుగా కరువుతో అల్లాడుతోంది. రైతులు, కూలీలు ఎలాంటి పనులు లేక గ్రామాల్లో బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కో గ్రామంలో రెండు మూడు బెల్టు షాపులు ఉండడం ద్వారా కూలీలు, రైతులు మద్యంకు ఆకర్షితులవుతున్నారని అన్నారు. దీంతో మొదటి వారు అప్పులు పాలు కాగా, తాగి ఇంటికి వెళ్ళడం ద్వారా భార్య పిల్లలతో గొడవలు పడి కాపురాలు నిర్వీర్యమవుతున్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా నియోజక వర్గంలో మద్యం షాపుల్లో ఎం ఆర్‌పీ ధరలకు విక్రయాలు చేపట్టకుండా భారీ స్థాయిలో ధరలు పెంచి అమ్మకాలు చేపట్టడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. తక్షణం ఎక్సైజ్‌పోలీసులు స్పందించి గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని, మద్యం ఎం ఆర్‌పీ ధరలకే అమ్మకాలు చేపట్టాలని డిమాండ్‌చేశారు. లేని పక్షంలో నియోజక వర్గం మొత్తం మీద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు జె. వెంకటేష్‌బాబు, రామకృష్ణ, నాయకులు ఎడీ ఎస్‌శరవణ, నళినీకుమార్, రంగయ్య, శ్రీనివాసమూర్తి, కె. మూర్తి, మోహన్‌రామ్, మోహన్, పార్థ, జయగోపి, మురుగేష్‌లు పాల్గొన్నారు.

Back to Top