<img style="margin-left:5px;margin-top:5px;float:right" src="http://pdf.ysrcongress.com/filemanager/files/News/vijayammma123.jpg" height="188" width="141">హైదరాబాద్, 7 సెప్టెంబర్ 2012 : విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నిరాహార దీక్షను శుక్రవారం రెండవ రోజూ కొనసాగిస్తున్నారు. తొలిరోజు దీక్షకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. విజయమ్మ దీక్ష చేస్తున్న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్దకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ విధానాలను విజయమ్మ ఖండించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆమె మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి రుణాన్ని తమ జీవితంలో తీర్చుకోలేమని ఫీజు దీక్షకు వచ్చిన విద్యార్థులు తెలిపారు.