ఉరవకొండ అభివృద్ధికి రూ.50 కోట్లు ఇవ్వాలి ముఖ్యమంత్రికి వైయ‌స్ఆర్‌సీపీ బహిరంగ లేఖ

ఉరవకొండ: ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు గురువారం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బ‌హిరంగ లేఖ రాశారు. జ‌ల‌సిరికి హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఉర‌వ‌కొండ‌కు చంద్ర‌బాబు వ‌స్తున్న నేప‌థ్యంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు క‌ర‌ప‌త్రాన్ని విడుద‌ల చేశారు.   
ప్ర‌ధాన స‌మ‌స్య‌లు:
1. ఉరవకొండ పట్టణంలోని 3వేల మంది పేదలకు ఇల్ల స్థ‌లాలు ఇచ్చేందుకు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం గతంలో 89 ఎకరాలు సేకరించింది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఈ స్థ‌లాలు మంజూరు చేయ‌డం లేదు. నంద్యాల ఎన్నికలే నమూనా అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబుకు ఉర‌వ‌కొండ గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నించారు.  ఎన్నికలు అనగానే నంద్యాలకు వందలకోట్లు ప్రకటించారు. 13వేల ఇండ్లు, వేలాది పింఛ‌న్లు ఇస్తామన్నారు. మరి ఉరవకొండ ప్రజలు చేసుకున్న పాపమేంది. కనీసం ఇప్పుడైన ఉరవకొండ పర్యటనలో హైకోర్టు తీర్పు స్పూర్తితో పేదలందరికి వెంటనే ఇండ్ల స్థలాలు మంజురు చేసి, పక్కా ఇండ్లు నిర్మించాలి.
2. ఉరవకొండలో రోడ్లు, డ్త్రెనేజీలు, త్రాగునీటి సరఫరా, విద్యుత్, మరుగుదొడ్లు ఇతర అభివృద్ధి పనులకు రూ50కోట్లు మంజురు చేసి, ఉరవకొండను మున్సిపాలిటీ చేయాలి.
3. చేనేత కార్మికుల‌కు ముడిపట్టు, శిల్కు సబ్సిడీ వెయ్యి రూపాయలు చొప్పున ప్రతి నెల ఇచ్చి, తొలగించిన చేనేత కార్డులను తిరిగి పునరుద్ధరించాలి. చేనేత కార్మికులకు ఇంటితో కూడిన చేనేత మగ్గం షెడ్లను నిర్మించి ఇవ్వాలి.
4. ఉరవకొండ బాలికల కళాశాలకు సొంత భవనాలు నిర్మించి, బాలుర కళాశాలకు కొత్త బ్లాకు నిర్మించాలన్నారు. పై సమస్యల పై సీఎం బహిరంగ సభలో వీటిని పరిష్కారం చూపాలని కోరారు.
Back to Top