రంపచోడవరంలో పార్టీ అభ్యర్థిగా రాజేశ్వరి

హైదరాబాద్:

తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ సెగ్మంట్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వంతెల రాజేశ్వరి పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేష‌న్‌ను ఆమోదించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా అంతకు ముందు అనంత సత్య ఉదయభాస్కర్ వేసిన నామినేష‌న్ తిరస్కరణకు గురైంది. దీనితో ఆయన స్థానంలో రాజేశ్వరి రంగంలో ఉంటార‌ని, ఈ విషయాన్ని ఓటర్లు గుర్తుంచుకోవాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల కో ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసా‌ద్ సోమవారం తెలిపారు. రాజేశ్వరికి అవకాశం రావడంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో ఉన్న మహిళా అభ్యర్థుల సంఖ్య 12కు పెరిగినట్లయింది.

Back to Top