రంగారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, 11 డిసెంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర మంగళవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది. మహేశ్వరం మండలంలోని కోళ్లపడకల్ గ్రామంలోకి శ్రీమతి షర్మిల ప్రవేశించడంతో రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

అక్టోబర్ 18న ఇడుపులపాయలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. మంగళవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు తాండ నుంచి శ్రీమతి షర్మిల తన పాదయాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంతో పాలమూరు జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగుస్తుంది.

శ్రీమతి షర్మిల పాదయాత్ర సోమవారం నాటికి 53 రోజులపాటు విజయవంతంగా కొనసాగింది. మొత్తం 756.30 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. మంగళవారంనాడు 16.5 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు.

Back to Top