రైతు సమస్యలపై సమర భేరి

మహబూబ్‌నగర్, 22 ఏప్రిల్ 2013:

పదవిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమయం సరిపోతుందని, రైతాంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ ఎడ్మ  కిష్టారెడ్డి మండిపడ్డారు. పాలమూరు జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, రైతుల సమస్య లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలో ఆయన 30 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎడ్మ మాట్లాడుతూ రెండేళ్లుగా ఏర్పడిన వ ర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో తీవ్రమైన కరవు నెలకొందని, కరెంటు కోతలతో ఉ న్న పంటలు ఎండిపోతున్నాయని, తాగునీ టి ఎద్దడి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రజల సమస్యలు తీర్చాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు ని ద్ర పోతోందని దుయ్యబట్టారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో రూ. 11,350 కోట్ల రు ణాలను మాఫీ చేసి రాష్ట్రంలో 68 లక్షల రై తు కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చే శారు. 27 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచి త కరెంట్ ఇవ్వడంతో పాటు రూ. 1200 కోట్ల కరెంట్ బిల్లులు మాఫీ చేశారన్నారు. కరవు బారినపడ్డ రైతాంగాన్ని ఆదుకోని కిరణ్ సర్కార్ ప్రజలపై వివిధ రకాల పన్నుల భారం మోపడం మరింత దారుణమని మండిపడ్డారు. వస్త్రాలపై 5 శాతం వ్యాట్ విధించి వ్యాపారులను, ప్రజానీకాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు. ఖరీఫ్‌లో గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో నకిలీ పత్తి సీడ్ విత్తనాల వల్ల 80 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే న్యాయం చేయమని ఆందోళనలు చేసిన రైతులను జైలుకు పంపిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

రూ. 32వేల కోట్ల కరెంట్ చార్జీలు, రూ. 1018 కోట్ల ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైయస్ఆర్ ఒక్క రూపాయి కూడా పన్నులు, కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. సీఈసీ సభ్యుడు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు శాశ్వత సాగునీటి వసతి కల్పించి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగన్మోహన్‌రెడ్డిపై కుట్రలు చేస్తున్నారే గానీ ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సీజీసీ సభ్యురాలు వంగూరు బాలమణెమ్మ, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి కూడా మాట్లాడారు. స్థానిక పార్టీ నేత ఎం.సురేందర్‌రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

Back to Top