రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: రఘురామిరెడ్డి

రాజుపాళెం: ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని వైయస్ఆర్‌ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రాజోలి ఆనకట్టను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. విద్యుత్, సాగునీరు, రైతుల పరిస్థితిపై అసెంబ్లీలో చర్చించకపోవడం దారుణమన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సమస్యలను సభ దృష్టికి తీసుకురావాల్సిందిపోయి కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుని అసెంబ్లీ సమావేశాలను జరగనీయకుండా అడ్డుకుందన్నారు. వర్షం పడక జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేసీ కెనాల్‌కు నీళ్లు వస్తాయని కొందరు రైతులు వరి పంటను సాగు చేశారన్నారు. ప్రస్తుతం ఆ పంట నీళ్లు లేక ఎండుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనకట్ట నుంచి వచ్చే నీరు కుందూ నదిలోకి వెళ్లకుండా కేసీ ప్రధాన, చాపాడు కాలువలకు వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సక్రమంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, చల్లబసాయపల్లె సంగన కిషోర్‌రెడ్డి, పెద్దచీపాడు బాలనరసింహారెడ్డి, చాపాడు ఈశ్వరరెడ్డి, లక్ష్మిపేట మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, బాలమునిరెడ్డి, మొరాయిపల్లె, మల్లెవేముల రైతులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే వైయస్‌ఆర్ సీపీ లక్ష్యం
పెనుబల్లి: పేదల సంక్షేమమే వైయస్‌ఆర్ సీపీ లక్ష్యమని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ రామసహాయం నరేష్ రెడ్డి చెప్పారు. పేదలపై పెను భారాలు మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగక తప్పదని అన్నారు. పెనుబల్లి మండలంలోని ఉప్పలచెలకలో 40, పార్థసారధిపురంలో 40, వావిళ్ళపాడు గ్రామంలో 20 కుటుం బాల వారు జె.నరసింహారెడ్డి నాయకత్వంలో నరేష్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఈ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి భరత్‌చంద్ర, మండల కన్వీనర్ చీకటి పెద్ద నరసింహారావు, నాయకులు కీసర వెంకటేశ్వరరెడ్డి, హరిబాబు, దారా రంగా, దారా నాగభూషణం, ఎం.వెంకటేశ్వర్లు, రాజురెడ్డి, జమల య్య, గరిక వందనం, బలుసుపాటి రాంబాబు, ఏసు, సీతారాములు, యాదయ్య, కర్రి మోహన్‌రావు, నాగా కృష్ణ, బందం వెంకటేశ్వరరావు, భూక్యా వెంకటేశ్వరరావు, గోళ్ళ గోపి, విపిరిశెట్టి రాము, మడకం చిన్న వెంకటేశ్వర్లు, శీలం వెంకటేశ్వరరెడ్డి, పులిచర్ల వెంకటేశ్వరరావు, కర్నాటి భద్రారెడ్డి, ఎ.సుంకయ్య, నాగుల రాములు, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
వైయస్ఆర్ సుభిక్ష పాలన మళ్లీ వస్తుంది

కల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ హయాం నాటి సుభిక్ష పాలన త్వరలోనే వస్తుందని వైయస్‌ఆర్ సీపీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ రామసహాయం నరేష్ రెడ్డి చెప్పారు. ఆయన కల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని, వైయస్.జగన్ ముఖ్యమంత్రి అవుతారని, వైయస్ఆర్ హయాం నాటి సుభిక్ష పాలనను తిరిగి తెస్తారని చెప్పారు. సమవేశంలో పార్టీ అధికార ప్రతినిధి భరత్‌చంద్ర, విద్యార్ధి విభాగం ప్రతినిధి మహేష్‌రెడ్డి, నాయకులు కీసర వెంకటేశ్వరరెడ్డి, జె.నరసిం హారెడ్డి, వైకంఠి హరిబాబు, కర్నాటి అప్పిరెడ్డి, బంకా బాబు, వేము దినకర్, వణుకూరి ప్రభాకర్‌రెడ్డి,ఉబ్బన శ్రీను, పప్పుల రత్నాకర్, బొక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Back to Top