రాష్ట్ర బంద్ సంపూర్ణం.. విజయవంతం


 హైదరాబాద్‌, 31 ఆగస్టు 2012: ప్రభుత్వ ఆంక్షలు అడుగడుగునా ఆటంకాలు కలిగించినా.. పార్టీ నేతలను ముందే అరెస్టు చేసినా.. బంద్‌ సందర్భంగా పోలీసు జులుం చెలరేగిపోయినా..  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో శుక్రవారంనాడు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్రమంతటా.. ఇటు ఆదిలాబాద్ మొదలుకొని అటు శ్రీకాకుళం వరకు, అలాగే ఇతర తీరప్రాంత జిల్లాలు, వైయస్సార్‌కడప జిల్లాతో పాటు రాయలసీమలోను బంద్‌ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా జరిగింది. శ్రీకుళం, గుంటూరు జిల్లాల్లో లాఠీచార్జి జరిగింది.

బంద్‌ ప్రశాంతంగా చేస్తున్న పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు వెంటపడి తరిమి లాఠీలతో చితకబాదారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో కుదేసి మరీ స్టేషన్లకు తరలించారు.  శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సతీమణి పద్మప్రియను పోలీసులు ఈడ్చుకెళ్ళారు. తాను పోలీసు వాహనంలో రాననీ, నడిచే వస్తాననీ ఆమె చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా ఎత్తి పోలీసు జీపులో కుదేశారు.

పరిస్థితిని గమనించిన కృష్ణదాస్ ఆమెను విడిపించి, తన వాహనంలో తీసుకెళ్ళారు. ఈ సంఘటనలో ఆయన చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరూ కలిసి ఎస్పీకి, గార ఎస్ఐ నారీమణిపై ఫిర్యాదు చేశారు. సంఘటనను స్పీకరు దృష్టికి తీసుకెడతానని ఆయన పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డినీ, తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డినీ, పులివెందులలో వైఎస్ అనిల్ రెడ్డినీ, విజయవాడలో వంగవీటి రాధాకృష్ణనూ, హైదరాబాద్‌లో ఆదం విజయకుమార్, రాజ్ ఠాకూర్, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేలమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

వాస్తవానికి పరమ ప్రశాంతంగా‌, స్వచ్ఛందంగా సాగుతున్న బంద్, పోలీసుల అతిప్రవర్తనతో ఉద్రిక్తంగా మారింది. ఎటువంటి విధ్వంసానికీ పాలుపడకుండా, చాలా ప్రశాంతంగా బంద్‌లో పాల్గొంటున్న తమపై  పోలీసులు దౌర్జన్యం జరిపారని, బరబరా ఈడ్చుకెళ్లి వాహనాల్లో కుదేసి తరలించారని, పోలీసుల దురుసు ప్రవర్తన వల్ల చాలా మంది గాయపడ్డారని పలుస్రాంతాల ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా సాగుతుండిన బంద్‌పై ప్రభుత్వం ఎందుకింత కవ్యింపుధోరణిలో అతిగా ప్రవర్తించిందో అర్థంకావడం లేదని, బహుశా.. తమకు రోజులు దగ్గరపడ్డాయన్న భయంతో, నిస్పృహతో ఇలా దౌర్జన్యానికి దిగారేమో అనిపిస్తోందని బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించిన అభిమాన ప్రజానీకం వ్యాఖ్యానించారు.

ఏదేమైనా బంద్‌విజయవంతం కావడం పట్ల అన్ని వర్గాల వారూ సంతోషం వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top