రాజన్న 'రైతు రాజ్యం' త్వరలో ఆవిష్కారం

ఆదోని:

భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండనీ, వైయస్ కలలు గన్న రైతన్న రాజ్యం వస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశరెడ్డి పేర్కొన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైయస్ షర్మిల వెంట పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయలక్ష్మి సమక్షంలో బైచిగేరి గ్రామం వద్ద ఆయన పార్టీలో చేరారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి పరులకు పెద్దపీట వేసి, మంచి వారిని బయటకు వెళ్లేలా చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఓపికతో ఉంటే పదవులు వస్తాయి అని చెప్పే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి గతంలో ఎంపీ టిక్కెట్ రాదనే ఆందోళనలో కర్నూలు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎందుకు తగలబెట్టారని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం లభించదన్నారు. 1978 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన తనకు గుర్తింపు ఇవ్వలేదన్నారు. అనంతరం టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచానన్నారు.

Back to Top