రాజన్న రాజ్యం కోసం ఉద్యమిస్తున్న జనం

మదనపల్లె:

రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ మదనపల్లె ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చెప్పారు. మదనపల్లె రూరల్ పరిధిలోని దుబ్బిగానిపల్లెలో ఆదివారం ఎమ్మెల్సీ సమక్షంలో దాదాపు వెయ్యి మంది గ్రామ ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి 600మంది, కాంగ్రెస్ నుంచి 400మంది కార్యకర్తలు  చేరారు. వీరందరినీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. దుబ్బిగానిపల్లె గ్రామంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిజమైన గ్రామస్వరాజ్యం వైయస్ఆర్ కాంగ్రెస్‌తోనే సాధ్యమౌతుందన్నారు.
ఏర్పేడు మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదనరెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top