రాజన్న పాలన మరోసారి చూడాలి

చిత్తూరు(కొంగారెడ్డిపల్లె):

‘నాయనా... మరోసారి రాజన్న పాలన చూ డాలి.... అందుకోసం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. రాబోయే ఎన్నికల్లో ఓటేసేంత వరకు మా గుండె చప్పుడు ఆగదు’ అని మహా నేత వైయస్.రాజశేఖరరెడ్డిని తలచుకుని పానాటూరుకు చెందిన వృద్ధులు కళ్లనీళ్లపర్యంతమయ్యారు. గురువారం గుడిపాల మండలంలోని పా నాటూరు, అనుపు, బోయనపల్లె, పల్లూరు, మఠం, చింతగుంటూరు గ్రామాల్లో గడప గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏర్పాటైంది. పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏఎస్. మనోహర్ దీనికి నాయకత్వం వహించారు. పానాటూరులో ఆయన తో వృద్ధులుపై విధంగా స్పందిం చారు. వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమగురు చేసేం దుకు ప్రభుత్వం చేస్తున్న ప్ర యత్నాలను ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు. పార్టీ గుడిపాల మండల కన్వీనర్ పీఎం.శ్రీధర్‌రెడ్డి, మహిళా వి భాగం కన్వీనర్ విజయలక్ష్మీ, జిల్లా కమిటీ మెంబర్ సుందరమణి, పానాటూరు, గొళ్లమడు గు పంచాయతీ కన్వీనర్‌లు జ్యోతీశ్వరరెడ్డి, పురుష్తోతమ్‌రెడ్డి, పానాటూరు మాజీ స ర్పంచ్ రఘు, డానియల్, మధుసూదన్ రాయల్, రఘునాథరెడ్డి, బాలాజీరెడ్డి, గజేంద్రరెడ్డి పాల్గొన్నారు.
పార్టీలో టీడీపీ నేత చేరిక
మంగళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాళెం పంచాయతీకి చెందిన మునిబాబూయాదవ్ గురువారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు దాదాపు 200మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ 29 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ సేవలందించిన తెలుగుయువత జిల్లా కార్యదర్శి మునిబాబూయాదవ్  తమ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.
వైయస్ఆర్ పథకాలను కొనసాగింస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించగలిగే సత్తా కేవలం జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న జనాదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ కక్షకట్టి జైలుకు పంపాయన్నారు. బాబూయాదవ్ మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి రాత్రింబవళ్లు కష్టపడి ఉన్న కొద్ది పాటి ఆస్తులను పోగొట్టుకున్నామని వాపోయారు.
సోనియా చేతిలో కీలుబొమ్మలు
కేవీపల్లె: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతిలో సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కీలుబొమ్మలుగా మారారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పి.రఘురామిరెడ్డి గ్యారంపల్లెలో గురువారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వారు చేస్తున్న కుట్రలను ప్రజలుగమనిస్తున్నారన్నారు. బహిరంగ సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో గ్యారంపల్లె హోరెత్తింది.

Back to Top