'రాజకీయంగా ఎదుర్కోలేకే కేసులు'

ధర్మవరం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని కాంగ్రెస్ రాజకీయంగా ఎదుర్కోలేక   అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ నేత తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. శ్రీ జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణను పార్టీ విద్యార్థి విభాగం తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రారంభించింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన సీబీఐ పక్షపాతంతో దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు.  దీన్ని రాష్రప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు.

Back to Top