పథకాలకు ప్రచారం తప్ప ప్రయోజనం శూన్యం

సంబేపల్లె: టీడిపి ప్రభుత్వం అమలు చేస్తున్నపథకాలకు ప్రచారం తప్ప ప్రయోజనం శూన్యమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పండించిన పంటను అమ్ముకోలేక తీవ్ర దుర్భర పరిస్థితులను ఈ ప్రాంత రైతాంగం ఎదుర్కొంటొందన్నారు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు కనబడుతుందని ఎద్దేవా చేశారు. వలస కూలీలను నివారించడానికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి వలసలను నివారించారన్నారు. అయితే ఇప్పటి ఉపాధి హామీ పథకంలో 3, 4,నెలలు అవుతన్నా కూలి డబ్బులు చెల్లించకుండా ఆ డబ్బును అట్టే అంటిపెట్టుకొందన్నారు. నీరు చెట్టు పనులకు సంబంధించి పనులు జరిగిన వెంటనే బిల్లులు చెల్లించిన ప్రభుత్వం ఉపాధిలో కూలీలకు బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గం అన్నారు. తెలంగాణలో రైతులకు ఎరువులకు ప్రీగా ఇచ్చినట్లు ఇక్కడ రైతాంగానికి ఎరువులు ఉచితంగా ఇవ్వాలన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు పింఛను సదుపాయం కల్పించాలన్నారు. ఈ ఖరీఫ్‌నుంచే రైతులకు 4 వేల రూపాయల పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే ప్రభుత్వం ఎరువులు ,విత్తనాలు ఉచితంగా రైతులకు అందించాలన్నారు. రాజకీయ కోణంలో కాకుండా రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆదుకోవాలన్నారు. 

2015 నాటికే కృష్ణా జలాలు వెలుగల్లుకు 3 టీఎంసీలు, శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీలు, జర్రికోనకు అర్ద టీఎంసీలు నీరు ఇస్తామన్న చంద్రబాబు 2017 వచ్చినా ఇంతవరకు ఆదిశగా చర్యలు చేపట్టలేదన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో జర్రికోన ప్రాజెక్టు పూర్తి అయినా, కాలువ పనులు మాత్రం ఇంతవరకు మొదలు కాకపోవడం ప్రభుత్వ అలసత్వానికి అద్దం పడుతోందన్నారు. జర్రికోన కాలువలకు సంబందించి సుండుపల్లెకు మాత్రమే నిధులను కేటాయించారని అలా కాకుండా సంబేపల్లె, చిన్నమండెం మండలాలకు కూడా నిధలు కేటాయించాలన్నారు. మూడు సంవత్సరాల నుంచి రైతులకు బీమా చెల్లించకుండా ఆ సొమ్మును ప్రభుతం అంటి పెట్టుకొని రుణమాఫీ కింద చెల్లించడం ఎంతవరకు సబబని నిలదీశారు. 
Back to Top