పూలే జ‌యంతి వేడుక‌లు

అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ... ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
అంటరానితనం రాజ్యమేలుతున్న తరుణంలో అణగారిన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశాజ్యోతిగా నిలిచారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు సమాన హక్కులు కావాలని అనేక పోరాటాలు నిర్వహించారని చెప్పారు. పేదరికంలో జన్మించిన ఫూలే సమాజం పట్ల తనకున్న పూర్తి అవగాహనతో అనేక దురాచారాలపై పోరాటం చేసి, బాల్య వివాహాలు, రెండు గ్లాసుల పద్దతి వంటి వాటిని రూపుమాపేందుకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడిచి ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.

పూలేకు ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఐజయ్య 
మహాత్మా జ్యోతిరావుఫూలే 191వ జయంతి సందర్భంగా స్థానిక బిర్లాసర్కిల్‌లో ఉన్న ఫూలే విగ్రహానికి నందికొట్కూరు ఎమ్మెల్యే వై ఐజయ్య పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ నేపథ్మంలోనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ ఇంచార్జీ హఫీజ్‌ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి తదితరులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
Back to Top