ధర్నాను విజయవంతం చేయండి

ఉరవకొండ:ఈనెల 7న స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కవితా హోటల్‌ సర్కిల్‌ వద్ద ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అయ్యే మహధర్నాను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జడ్‌పీటీసీ తిప్పయ్య, ఎస్‌సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, మండల కన్వీనర్‌ వెలిగొండ నరసింహులు మాట్లాడుతూ ...వైయస్‌ఆర్‌సీపీ టికెట్‌ పై ఎన్నికల్లో గెలిచి ప్రలోభాలకు గురై టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదువులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ అధ్వర్యంలో ఉరవకొండలో మహధర్నా చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్వర్యంలో జరిగే మహధర్నాలో నియోజకవర్గ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు రాజ్యాంగం పై గౌరవమున్న అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజాసంఘాలు కలిసి ముందుకు వచ్చి మద్దతు తెలపాలన్నారు. పార్టీ ఫిరాయింపుదారులకు పదవులివ్వడం రాజ్యాంగ విరుద్ధమని దీనిపై వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమీటి సభ్యలు లత్తవరంగోవిందు, ఆంజినేయులు, నిరంజన్‌గౌడ్, ఎంపీటీసీలు రామకృష్ణ, ప్రసాద్, వార్డు సభ్యలు ఈడిగప్రసాద్,వెంకటేష్, ప్రభాకర్, రాజ, మూలగిరిపల్లి ఓబన్న, వెలిగొండ ఓబన్నలు పాల్గొన్నారు.

Back to Top