బీసీలకు బాబు వంచనపై నిరసనలు

విజయవాడ: వెనకబడిన వర్గాల ప్రజలను (బీసీలను)
నిలువునా వంచిస్తున్న చంద్రాబబు ప్రబుత్వ మోసపూరిత చర్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా
వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ,
భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు.
కడప జిల్ల కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంజద్ భాషా.
రవీంద్రనాథ్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఆందోళనలో
రిటైర్డు ఐఎఎస్ అధికారి చంద్రమౌళి తోపాటు బిసి విభాగం నేతలు అరణి శ్రీనివాసులు,
జ్ఞాన జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ
ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నాలుగున్నరేళ్లుగా
బిసి వర్గాల సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు ఆదరణ, జయహోబీసీ అంటూ మరోసారి వంచనకు
తెరదీశారని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయంలో ప్రబుత్వ
వైఖరిని గర్హిస్తూ నిరసన గళం విప్పారు. 

 

తాజా వీడియోలు

Back to Top