బాబు రాక్ష‌స పాల‌న‌పై నిర‌స‌న‌ల వెల్లువ‌

హైద‌రాబాద్‌:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాగుతున్న  చంద్రబాబు రాక్షస, అరాచక పాలనకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు వెల్లువెత్తుతున్నాయి. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని మండ‌ల కేంద్రాల్లో   నిరసనలు, ధర్నాలు చేప‌ట్టారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే.. బాధితులను పరామర్శించడానికి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి దుర్ఘటన స్థలానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరంకుశత్వం, అప్రజాస్వామికమని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top