రైతులకు ప్రభుత్వమోసం మీద నిరసన

() రాష్ట్రప్రభుత్వం చేస్తున్న మోసాలు బట్టబయలు

() కేంద్ర నిధుల్ని పక్కదారి పట్టిస్తున్న వైనం

() నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్

హైదరాబాద్) రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని శాసనసభ సాక్షిగా
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎండగట్టారు. వ్యవసాయ మంత్రి ఇచ్చిన గణాంకాల ఆధారంగానే ...
జరుగుతున్న మోసాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా
శాసనసభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

       శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో
రైతుల రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ మీద వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
జవాబులు ఇచ్చారు. దీని మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు. 2013..14 ఆర్థిక
సంవత్సరంలో మూడు తుపాన్ లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకొంటామని
చెప్పారని , ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పిస్తామని చెప్పారని వివరించారు. అధికారంలోకి
వచ్చిన వెంటనే 2013..14 కు సంబంధించి 16 వందల కోట్ల రూపాయిల ఇన్ పుట్ సబ్సిడీకి
ఎగనామం పెట్టారని చెప్పారు.

       తర్వాత 2014..15 కు సంబంధించి
జరిగిన నష్టాన్ని మదింపు చేసి అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు దాదాపు రూ. 16వందల
కోట్ల రూపాయిలు ఇప్పించాలని నివేదికలు ఇచ్చినట్లు వైఎస్ జగన్ చెప్పారు. మంత్రివర్గ
సమావేశాల్లో రక రకాల వంకలు వెదికి చివరకు రూ. 858 కోట్లు చెల్లించారని, ఇంకా 79
కోట్లు బకాయిలు పెట్టినట్లు మంత్రిగారు సమాధానంలో ఉందని వివరించారు. తర్వాత
2015..16 కు సంబంధించి 1,021 కోట్లు చెల్లించాల్సి ఉండగా దమ్మిడీ చెల్లించలేదని
వ్యవసాయ మంత్రి సమాధానంలో ఉందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే రూ. 1,692 కోట్ల
రూపాయిలు ఎగనామం పెట్టి, 80 కోట్లు బకాయిలు పెట్టేందే కాకుండా ఇపుడు రూ. 1,021
కోట్లు చెల్లించకుండా కాలక్షేపం చేస్తున్నారని వైఎస్ జగన్ గణాంకాలతో సహా తేల్చి
చెప్పారు.

ఇదే సమయంలో మరో ముఖ్య విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బయట పెట్టారు. 2014..15
కు సంబంధించి కేంద్రం ఒకసారి 738, మరోసారి 237 కోట్లు మొత్తంగా రూ. 975 కోట్లు
కేంద్రం కేటాయించిందని చెప్పారని వివరించారు. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో
రూ. 975 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మొత్తంగా రూ. 858 కోట్లు మాత్రమే ఇచ్చారని
చెబుతున్నారు. వాస్తవానికి ఇన్ పుట్ సబ్సిడీ లో సగం కేంద్రం ఇస్తే, అంత మొత్తం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. అంటే ఇక్కడ రూ. 975 కోట్లు
ఇవ్వాల్సి ఉండగా, మొత్తంగా రూ. 858 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. మిగిలిన
మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు డైవర్ట్ చేసిందని మండిపడ్డారు. 2015..16
కు సంబంధించి రూ. 432 కోట్లు, మరోసారి రూ. 480 కోట్లు ఇచ్చిందని చెప్పారని అంటే
రూ. 725 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, రూ. 1,021 కోట్లలో రాష్ట్ర
ప్రభుత్వం ఒక్క దమ్మిడీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇంత దారుణంగా కేంద్ర ప్రభుత్వ
నిధుల్ని వాడుకొంటూ రైతులకు సాయం చేయకపోవటాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష  వైఎస్సార్సీపీ వాకౌట్ చేస్తోందని వైఎస్ జగన్
ప్రకటించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ సభ్యులు సభ బయటకు నడిచారు. 

Back to Top