పనికి తగ్గ వేతనం లేదు

కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను గన్నవరం నియోజకవర్గంలో ప్రయివేట్‌ లెక్చరర్స్, ఉపాధ్యాయులు వైయస్‌ జగన్‌ను కలిశారు. పనికి తగ్గ వేతనం లేదని, ఉద్యోగ భద్రత లేదని వారు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రయివేట్‌ లెక్చరర్స్‌ ఉన్నారని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగభద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు, పీఎఫ్, ఈఎస్‌ఐ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ కాలేజీల్లో పనిచేస్తున్న మాకు కార్పొరేట్‌ వైద్యం అందడం లేదన్నారు. సెలవు దినాల్లో కూడా పని చేయించుకుంటూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.  
Back to Top