టీడీపీ ప్రభుత్వం అన్నింటిలో విఫలం

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ రోజులు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. పోలవరం కడతామన్నారు..ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతు రుణమాఫీ అని మోసం చేశారన్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా లోన్లు ఇస్తామన్నారు..ఎంతమందికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అన్నింటిలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. దోచుకోవడంలోనే టీడీపీ నేతలు పాస్‌ అయ్యారని విమర్శించారు. ఇసుక, మట్టి, రాజధాని పేరు మీద దోచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. తాడేపల్లి రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని మాట తప్పారన్నారు. ఆటోనగర్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని, మార్కెట్‌యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి నుంచి మంచినీళ్లు తెప్పించుకుందామన్నారు. ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్‌ కావాలన్నారు.  నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పారు. 
Back to Top