అనంతపురం జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం
అనంతపురం :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంత‌పురం జిల్లాలో ప్రారంభ‌మైంది. సోమ‌వారం ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ త‌న 26వ రోజు పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టారు. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసినేపల్లి నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభ‌మైంది.  జ‌న‌నేత‌కు అనంత‌పురం జిల్లా పార్టీ నేత‌లు, స్థానిక ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గుత్తి ఆర్ఎస్ వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. సాయంత్రం గుత్తిలోని గాంధీ చౌక్‌లో బహిరంగ సమావేశంలో వైయ‌స్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి  గుత్తిలోనే  బస చేస్తారు.

నవంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించ‌గా, గ‌త నెల 14న క‌ర్నూలు జిల్లాలోకి ప్ర‌వేశించారు. ఈ నెల 3వ తేదీ వ‌ర‌కు ఆ జిల్లాలోనే పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని వారికి భ‌రోసా క‌ల్పించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ, త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు.
Back to Top