పశ్చిమలో ప్రజాసంకల్పానికి జన నీరాజనం

వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మే 15న పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టింది. కృష్ణాజిల్లా
సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలోకి రవేశించింది.
ఈ సందర్భంలోనే పాదయాత్రలో 2000 కిలోమీటర్ల మైలు
రాయిని గూడా అధిగమించారు వైఎస్ జగన్. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపుల
పాయిలో మొదలైన ప్రజా సంకల్పం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు,
ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాలను
దాటుకుని పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ప్రతి జిల్లాలోనూ
జన ప్రభంజనమే. ప్రతి నియోజక వర్గమూ జన సంద్రమే. పాదయాత్రుకుని వెంట నడిచేందుకు, ఆ యువనేత తో ఒక్కసారి
చేయి కలిపేందుకు, ఓ ఫొటో దిగేందుకు, తమ
సమస్యలు చెప్పుకునేందుకు, ఓభరోసాని అందుకునేందుకు తెలుగు ప్రజలు
ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ప్రజాసంకల్పం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు
మండలం వెంకటాపురం వద్ద 2000కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా
పైలాన్ ఆవిష్కరించారు. దెందులూరు, గోపాలపురం,
తాడేపల్లి గూడెం, ఉంగటూరు, ఉండి, భీమవరంమీదుగా
సాగుతున్న ప్రజా సంకల్పం మరో పది రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరగనుంది. శుక్రవారం  ఉదయం పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మొత్తంగా
13 నియోజకవర్గాలు, 250 కి.మీ మేర వైఎస్ జగన్ పాదయాత్ర ఈ జిల్లాలో సాగుతుంది. జూన్
రెండో వారంలో  తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు
పెట్టబోతోంది.



జననేతకు
ఘన స్వాగతం

అడుగడుగునా
ఘనంగా స్వాగతాలు. పూల దారులు, హారతుల తోరణాలు. జై
జగన్ నినాదాలు, అన్నా అంటూ ఆత్మీయంగా పలకరింపులు. పశ్చిమ గోదావరిలో అడుగుపెట్టిన క్షణం నుంచీ యువనేతను గోదావరి వాసులు గుండెలను
దారులుగా పరిచి మరీ స్వాగతిస్తున్నారు. ఆ యువనేత అడుగులో అడుగు
వేస్తున్నారు. తమ కష్టాలు వినే నాయకుడొచ్చాడని బ్రహ్మరధం పడుతున్నాడు.
ఊళ్లకు ఊళ్లే కదిలి వస్తున్నారు. యువత,
మహిళలు పెద్ద సంఖ్యలో జన నేతకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రైతులు, కూలీలు, ఆటో డ్రైవర్లు,
ఆక్వారైతులు, ఆశావర్కర్లు, న్యాయవాదులు, మత్స్యకారులు, వివిధ
సంఘాల నేతలు వైఎస్ జగన్ ను కలిసి తమ వినతులు వినిపిస్తున్నారు.

పశ్చిమానికి
బాబు పచ్చిమోసం

‘’పశ్చిమగోదావరి జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఇక్కడి
ప్రజలు నాకు 15కు 15 అసెంబ్లీ సీట్లు గెలిపించారు.
పశ్చిమ వాసుల రుణం తీర్చుకుంటా’’ ఇవి అధికారంలోకి
వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబు చెప్పిన
మాటలు. సిసిరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
నిర్మాణాలకు 200 కోట్లు అన్నాడు, ద్వారకా
తిరుమలను పారిశ్రామిక హబ్ గా చేస్తానన్నాడు. ఆ తర్వాత మరో సందర్భంలో
ద్వారకా తిరుమలను హెల్త్ హబ్ గా మారుస్తానన్నాడు. ఈ ప్రాంతంలోని
171 ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేసి అనువైన పరిశ్రమల ఏర్పాటు
చేస్తామన్నాడు. కాలుష్య నియంత్రణకు ప్లాన్ చేస్తానని హామీ ఇచ్చాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ‘నిట్’ ఏర్పాటు చేస్తానన్నాడు. మైరైన్ యూనివర్సిటీ తెస్తానని
ప్రగల్బాలు పలికాడు. తాడేపల్లి గూడెంలో ఎయిర్ పోర్టు అన్నాడు.
భీమవరంలో ఆక్వా విశ్వవిద్యాలయం అన్నాడు. గోపాల
పురంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నాడు. వీటిలో ఏ ఒక్క
హామీ కూడా నెరవేర్చలేదని పశ్చిమవాసులు ఆవేదన చెందుతున్నారు. 

Back to Top