ప్రజల సుఖశాంతుల కోసం విజయమ్మ ప్రార్థనలు

హైదరాబాద్, 25 డిసెంబర్ 2012: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం ఉదయం మణికొండలోని చర్చికి వెళ్లారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే అందరూ ఐక్యమత్యంగా ఉండాలని శ్రీమతి విజయమ్మ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చర్చిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.  క్రిస్మస్ సందర్భంగా పిల్లలు ఆలపించిన ప్రార్థనా గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

తాజా వీడియోలు

Back to Top