'ప్రజల కష్టాలు చూడలేని గుడ్డి ప్రభుత్వం'

కర్నూలు, 2 మార్చి 2013: ప్రజల ఇబ్బందులు చూడలేని గుడ్డితనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‌నడుస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని విధాలుగాను రాష్ట్ర ప్రజలు ఇబ్బందు పడుతుంటే ఈ ప్రభుత్వం దున్నపోతు మీద నీరు చందాన వ్యవరిస్తోందని ఆయన విమర్శించారు. పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని‌ శనివారం కర్నూలులో మాట్లాడుతూ తెలిపారు. అయితే, ప్రభుత్వానికి మాత్రం ప్రజల కష్టాలు, కడగండ్లేమీ పట్టడంలేదని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top