ఉవ్వెత్తున ఎగసిపడిన జనతరంగం

యానాం–ఎదుర్లంక వంతెనపై జనజాతర
జననేతకు అపూర్వ స్వాగతం పలికిన కోనసీమ

తూర్పుగోదావరి: యానాం– ఎదుర్లంక వంతెనపై జనతరంగం ఉవ్వెత్తున ఎగసిపడింది. బ్రిడ్జి జన జాతరతో కళకళలాడింది. 203వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌కు కోనసీమ ప్రజలకు అపూర్వస్వాగతం పలికారు. పార్టీ జెండాలు చేతపట్టి వైయస్‌ జగన్‌ వెంట వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయన అడుగులో అడుగులు వేశారు. అన్న ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాదయాత్రకు తరలివచ్చారు. అన్నా మా భవిష్యత్తుకు నువ్వే భరోసా అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. వైయస్‌ జగన్‌తో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. అదే విధంగా యువత సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. 
Back to Top