ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో అడగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి ఎలూరు మండలంలోకి ప్రవేశించే పెదయెడ్లగాడి వంతెన మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆళ్లనాని తదితర నాయకులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి జననేతకు ఘనస్వాగతం పలికారు. వైయస్ జగన్ రాకతో ఈ రహదారంతా సందడి వాతావరణం ఏర్పడింది. జై జగన్ నినాదాలతో కిటకిటలాడాయి. మేనెల- పశ్చిమ గోదావరి- వైయస్ కుటుంబ అనుబంధం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసిన కుటుంబంగా చరిత్రపుటల్లో నిలిచిన వైయస్ కుటుంబానికి పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉందని, అందునా మండుటెండలు ఉండే మేనెలతో ఈ అనుబంధం పెనవేసుకుపోయి ఉందని జిల్లా వాసులు అంటున్నారు. గతంలో 2003 మహానేత వైయస్ ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రతో జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పాదయాత్ర చేసి తామవరపు కోట ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారని, అదే విధంగా 2013 లో జగనన్న వదిలన బాణంగా పాదయాత్ర చేపట్టిన వైయస్ షర్మిల కూడా మేనెలలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉండటమే కాకుండా, ఆమె కూడా ఇదే ప్రాంతంలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటారని, ఇప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడమే కాకుండా, చారిత్రక 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం సంతోషదాయకంగాను, గర్వకారణంగానూ ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు.