పోరాట యోధుడు

పోరాట యోధుడు
ప్రజా సమస్యల పరిష్కారమే జననేత ధ్యేయం
600ల కి.మీ దాటిన ప్రజా సంకల్పయాత్ర
వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అడుగడుగునా ఆదరణ
రాజన్న బిడ్డపై ప్రతి గ్రామంలో పూలవర్షం
మా భవిష్యత్తు నువ్వేనంటూ జెండా మోస్తున్న చిన్నారులు
అడుగులో అడుగేస్తున్న ఆంధ్రరాష్ట్ర ప్రజానికం
పేద బతుకులను రూపుమాపుతానని వైయస్‌ జగన్‌ భరోసా




అనంతపురం: ప్రజా సమస్యల పరిష్కరమే ఆయన ధ్యేయం.. రాజకీయాల్లో విశ్వసనీయత తీసుకురావాలనేది ఆయన సంకల్పం... ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడడు. ప్రతీ నిమిషం ప్రజల కోసమే ఆరాటం. పోరాటం. చంద్రబాబు తప్పుడు హామీలు నమ్మి మోసపోయిన ప్రజలను అక్కున చేర్చుకునేందుకు, వారి కష్టాలన్నీ విని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేపట్టారు. తన తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తరహాలో సుమారు 6 నెలల పాటు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర మొదటి అడుగు నేడు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లి వద్ద 6 వందల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కటారుపల్లి వద్ద 600ల కిలోమీటర్లు దాటిన సందర్భంగా వేప మొక్కును నాటారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా ఆదరణ, ఆప్యాయత లభిస్తుంది. ఇప్పటి వరకు కడప, కర్నూలు, ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్‌ జగన్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొంత మంది ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. రాజన్న బిడ్డ మన వాడకు వచ్చాడంటూ ప్రజలంతా పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. పలుచోట్ల వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో పూలవర్షం కురిపిస్తున్నారు. వైయస్‌ జగన్‌తో కరచాలనం చేసేందుకు ప్రజలు, సెల్ఫీలు తీసుకునేందుకు యువత పోటీపడుతున్నారు. జగనన్నా నువ్వే మా భవిష్యత్తుకు మార్గం అని చిన్నారులు చేతిలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా పట్టుకొని జననేత అడుగులో అడుగేస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ అధైర్యపడొద్దమా.. మీకు నేనున్నా.. అంటూ ధైర్యం చెబుతూ వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారు. 

చంద్రబాబు పాలనతో విసిగిపోయామని ప్రజలంతా వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకుంటున్నారు. పెన్షన్‌ రావడం లేదని వృద్ధులు, వికలాంగులు, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు, రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదని మహిళలు, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు, ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నా అని యువత ఇలా ప్రతి ఒక్కరూ పాదయాత్రకు తరలివచ్చి జననేతకు వారి సమస్యను చెప్పుకుంటున్నారు. ‘ఇంకో సంవత్సర కాలం ఈ మోసపు ప్రభుత్వం ఉంటుంది. తరువాత మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం వస్తుంది’. మన ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారు. అంతే కాకుండా పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పెన్షన్, అర్హులందరికీ ఇళ్లు, రుణమాఫీ, రైతు పంటకు గిట్టుబాటు ధర ఇలా అన్ని పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తామని, గ్రామ సచివాలయంలో సమస్య చెబితే అడిగిన 72 గంటల్లోనే పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేస్తామని వివరిస్తున్నారు. 

నవంబర్‌ 6వ తేదీన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటికీ 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమ్రరి మండలంలో 100 కిలోమీటర్లు, డోన్‌ నియోజకవర్గం ముద్దనూరులో 200 కిలోమీటర్లు, ఎమిగనూరు బిఅగ్రహారం మండలం కారుమంచిలో 300ల కిలోమీటర్లు, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి వద్ద 400ల కిలోమీటర్లు, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు వద్ద 500ల కిలోమీటర్లు, కదిరి నియోజకవర్గంలో కటారుపల్లిలో 600ల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 

తాజా వీడియోలు

Back to Top