పొన్నూరు, వేమూరులలో నేడు షర్మిల పాదయాత్ర

గుంటూరు, 18 మార్చి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంనాడు పొన్నూరు, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతుంది. ఆదివారం రాత్రికి చేబ్రోలు శివారులో బసచేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్‌, కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్‌ తెలిపారు. చేబ్రోలు శివారు నుంచి శ్రీమతి షర్మిల మంచాల, బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు, వెల్లలూరు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారని వారు వివరించారు. భోజన విరామం అనంతరం తొట్టెంపూడి, మామిళ్లపల్లి, మోదుకూరు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారని వారు తెలిపారు.
Back to Top