నేడు, రేపు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన

ఖమ్మం: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధ, గురువారల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. బుధవారం ముదిగొండ మండలం గంధసిరిలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. గురువారం ఉదయం పెనుబల్లి మండలంలోని నీలాద్రి, కంపెనకుంట్ల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం వైరా మండలంలో పర్యటిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ ద్వారా చేపట్టబోయే పలు పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితోపాటు పలు శుభకార్యాలకు హాజరవుతారు.
Back to Top