ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

  • ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయ్యింది
  • ఫిరాయింపుదారులకు మంత్రి పదువులు ఇవ్వడం అనైతికం
  • ఇది ఆపకపోతే ఇవాళ వైయస్సార్సీపీ రేపు ఇంకో పార్టీకి జరుగుతుంది
  • చంద్రబాబు రాజ్యాంగవ్యతిరేక చర్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని వినతి
ఢిల్లీః వైయస్సార్సీపీ టికెట్ పై గెలిచి టీడీపీలోకి ప్రలోభాలతో వెళ్లిన ఎమ్మెల్యేలను  అనర్హులుగా ప్రకటించే అంశం స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉండగా..చంద్రబాబు మరో అడుగు ముందుకేసి వాళ్లలో కొందరినీ ఏకంగా మంత్రిమండలిలోకి తీసుకోవడంపట్ల వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఇటువంటివి ఆపకపోతే ఇవాళ ఏపీలో జరిగింది రేపు ప్రతీ రాష్ట్రంలో ఇదే మాదిరి జరుగుతుందని,   మంత్రులు ఏ పార్టీకి చెందిన వాళ్లన్నది అర్థం కాని పరిస్థితిలోకి పోతామని వైయస్ జగన్ అన్నారు. వైయస్ జగన్ తన ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే....

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోతున్న పరిస్థితిల్లో కాపాడమని ప్రెసిడెంట్ ను కోరడం జరిగింది. ఆయనకు అర్జీ కూడ ఇచ్చాం. సానుకూలంగా స్పందించాడు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అపాయింట్ మెంట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరినీ కలిసే కార్యక్రమం పెట్టుకున్నాం. ఇలా ఎందుకు కలుస్తున్నామంటే... ఇవాళ మా దాకా వచ్చింది. ఎవరూ రియాక్ట్ కాకపోతే రేపు ఇతర పార్టీల దాకా వస్తుంది. వాళ్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లి మంత్రివర్గంలోకి తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. పార్టీలకతీతంగా ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యం కాపాడే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేయమని కోరతాం. ఎవరైతే బీజేపీ నిర్ణయాన్ని ప్రభావితం చేయగలుగుతారో వారిని ఇంకా ఎక్కువగా అపాయింట్ మెంట్ అడుగుతాం. ఇక్కడ వీళ్లు స్పందిస్తే అక్కడ బాబుకు మొట్టికాయలు వేస్తారు. అప్పుడు స్పీకర్ వెంటనే రాజీనామా ఆమోదించి డిస్ క్వాలీఫై చేయడం జరుగుతుంది. చంద్రబాబు చేస్తున్నది అనైతిక కార్యక్రమం. విచ్చలవిడిగా సంపాదించిన బ్లాక్ మనీతో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఏరకంగా డబ్బులిస్తూ ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయారో అందరం చూశాం. ఏపీలో బాబు చేస్తున్న కరప్షన్ ను  కాగ్ కూడ తప్పుబట్టింది. రాష్ట్రంలో ఇసుక నుంచి మట్టిదాక, మట్టి నుంచి మద్యం దాక, మద్యం నుంచి బొగ్గు దాక, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లు, జెన్ కో దాక చివరకు గుడి భూములు, గుడిలో లింగాన్ని కూడ వదలకుండా చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నాడు. ఈమాదిరిగా విచ్చలవిడిగా ప్రజాస్వామ్యం ఖూనీ చేయడం ధర్మం కాదు.  వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. 
Back to Top