<strong>కుట్ర వెనుక స్థానిక టీడీపీ నేతల హస్తం ఉంది..</strong><strong>వైయస్ జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన ఠాణేలంక వాసులు</strong>తూర్పుగోదావరిః టీడీపీ అరాచక పాలనలో మగ్గుతున్న రాష్ట్ర ప్రజలకు వైయస్ జగన్ ఆశాదీపంలా ఉన్నారని..ఆ ఆశాజ్యోతిని అంతం చేయాలని టీడీపీ ప్రయత్నం చేసిందని తూర్పుగోదావరి జిల్లా ఠాణేలంక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ను హత్య చేయడానికి తెగబడిన నిందితుడు శ్రీనివాస్ స్వగ్రామమైన ఠాణేలంక ప్రజలు వైయస్ జగన్‌పై హత్యాయత్నం పట్ల తీవ్రంగా ఖండించారు. ఠాణేలంకలో అల్లరిచిల్లరగా తిరిగే ఒక సామాన్య యువకుడు శ్రీనివాస్‌కు ట్రైనింగ్ ఇచ్చి హత్యకు పురిగొల్పారన్నారు. దాడి వెనుక టీడీపీ నేతల కుట్ర వుందని నమ్ముతున్నామన్నారు. వైయస్ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ ఇలాంటి చర్యలకు తెగబడుతుందని విమర్శించారు. డబ్బులు ఖర్చుపెట్టినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేకపోవడం, సర్వేలు కూడా వైయస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా రావడంతో బలమైన ప్రతిపక్ష నేతను అంతమొందించడానికి టీడీపీ పన్నాంగం పన్నిందన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి టీడీపీ నాయకులు కూడా ఆ కుట్రలో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం వైయస్ జగన్‌ను హత్య చేయడానికి పథక రచన జరిగిందన్నారు. అనేక మరణాయుధాలు ఉండగా కోడి కత్తితో హత్యాయత్నానికి ప్రయత్నించడం వెనుక పెద్ద కుట్రకోణం దాగి వుందన్నారు. మెడ భాగంలో నరాని తెగకోస్తే ప్రాణాలు నుంచి బయటపడలేరనే పక్కా ప్రణాళికతో నిందితుడికి ప్రొఫెషనల్ కిల్లర్స్‌తో ట్రైనింగ్ ఇప్పించారన్నారు. అల్లర చిల్లరిగా తిరుగే శ్రీనివాస్‌ను అత్యంత భద్రత జోన్ అయిన ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం ఇచ్చారంటే దీని వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందన్నారు. ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పె రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.