<strong>- తక్కెళ్లపాడులో జనంతో వైయస్ జగన్ మమేకం</strong><strong>- అండగా ఉంటానని ధైర్యం చెప్పిన జననేత</strong> ప్రకాశం: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అడుగడుగునా జనం ఎదురెళ్లి సమస్యలు వివరిస్తున్నారు. అన్నా..మీరే మాకు దిక్కు అంటూ మొరపెట్టుకుంటున్నారు. సోమవారం తక్కెళ్లపాడు గ్రామంలో ఆయన జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గోడు జననేత ఎదుట వెల్లబోసుకున్నారు. అన్నా..చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం వల్ల తమకు ఒనగూరింది ఏమీ లేదని, నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు, కూలీలు గిట్టడం లేదని వ్యవసాయ కూలీలు, ఉపకార వేతనాలు అందడం లేదని విద్యార్థులు, సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు వైయస్ జగన్‌ను కోరారు. ఉద్యోగాలు లేక వలస వెళ్తున్నామని యువకులు తమ బాధలు చెప్పుకున్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ‘ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం రాగానే అందరికీ ఉపాధి చూపుతాం’ అని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలతో అందరినీ ఆదుకుంటామన్నారు. <br/>