పోటెత్తుతున్న ప‌ల్లెలు

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగడుగునా ఘన స్వాగ‌తం
- మీదే దిక్కు అంటూ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న జ‌నం
- భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్న జ‌న‌నేత‌
గుంటూరు: ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ  వైయ‌స్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఆ ఊరికి రాజ‌న్న బిడ్డ వ‌స్తున్నాడ‌ని తెలిసి ప‌నులు మానుకొని జ‌నం ఇళ్ల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. పాద‌యాత్ర వ‌చ్చే దారికి వెళ్లి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. వీధుల‌న్నీ పార్టీ జెండాల‌తో ముస్తాబు చేసి తమ ఆత్మీయ నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తీక్ష‌ణ‌మై ఎండ‌ను లెక్క‌చేయ‌కుండా వేలాది జ‌నం జ‌న‌నేత వెంట అడుగులో అడుగులు వేస్తూ త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది.  116వ రోజు  మంగళవారం ఉదయం  పెదనందిపాడు శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అక్కడ నుంచి రాజుపాలెం క్రాస్‌, పాలపర్రు, పరిట్లవారిపాలెం క్రాస్‌, అన్నవరం క్రాస్‌ మీదగా ఉప్పలపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. 

పూల‌బాట‌..స‌మ‌స్య‌ల మూట‌
జ‌న‌నేత త‌మ గ్రామానికి వ‌స్తున్నారని చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. రాజ‌న్న బిడ్డ వ‌చ్చే దారుల‌పై పూల ప‌రిచి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఎటు చూసినా జ‌న‌మే జ‌నం..మిద్దె,. మేడా, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిపోతున్నాయి.  తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్ప దీక్షబూనిన పాదయాత్రికుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం తొలిపొద్దు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో వింటూ, పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన జననేతను చూసి మురిసిపోయాయి. తనను చూసేందుకు చిన్నపిల్లలతో వచ్చిన మహిళలను జననేత ఆప్యాయంగా పలుకరించి, చిన్నారులను ఎత్తుకుని వారితో సెల్ఫీలు దిగుతున్నారు.  వారి బాధ‌లు వింటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. 

Back to Top