పోటెత్తిన బాపట్ల



- గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు బ్ర‌హ్మ‌ర‌థం
- జ‌న‌నేత‌కు బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
గుంటూరు: రాజన్న బిడ్డ రాకతో బాపట్ల గడ్డ పులకించింది. ఆయన భరోసా కొత్త ఆశలను నింపుతోంది. ఆప్యాయత, అనురాగాలు జోడించి జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ నెల 12న గుంటూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది. బాపట్ల మండలంలోని స్టువర్టుపురం వద్ద ఉదయం 9.08 గంటలకు యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌చేశారు. జ‌న‌నేత‌కు ప‌ల్నాడువాసులు బ్రహ్మరథం ప‌ట్టారు. బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జగన్‌కు జేజేలు పలికారు. ప్ర‌జాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో అడుగుపెట్ట‌గానే వైయ‌ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎదుట రైతులు త‌మ ఆవేద‌న‌ను చెప్పుకున్నారు.  కన్నీటితో సేద్యం చేసినా గిట్టుబాటు ధర రాక రైతులు.. ఉద్యోగం రాక, భృతికి నోచుకోక నిరుద్యోగులు.. వృద్ధాప్యంలో భరోసా ఇచ్చే పింఛన్లు అందక పండుటాకులు.. పెరిగిన నిత్యావసరాల ధరలతో సంసారాన్ని ఈదలేక సతమతమవుతున్న సామన్యులు. ఇలా అన్ని వర్గాల ప్రజలు రాజన్న బిడ్డకు తమ గోడు వినిపించారు. జనసంద్రమైన దారుల మధ్య కన్నీటి గాథలు, బతుకు వెతలు వింటూ, వారికి భరోసా ఇస్తూ జగన్‌ ముందుకు సాగారు. నిన్న సాయంత్రం బాప‌ట్ల ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాది ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌డంతో జ‌న‌సంద్ర‌మైంది. ఇవాళ ఉద‌యం బాపట్ల శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్రను ఆరంభించారు. బాపట్ల మూర్తి రక్షణ నగరం, కొండుబొట్లవారి పాలెం క్రాస్‌, అప్పికట్ల, పూండ్లక్రాస్‌ మీదగా ఈతేరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈతేరులో వైయ‌స్‌ జగన్‌...ప్రజలతో మమేకం అవుతారు. ఇప్పటివరకూ వైయ‌స్‌ జగన్‌ 1,484.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పాద‌యాత్ర దారుల‌న్నీ జ‌నంతో కిక్కిరిపోతున్నాయి. ఎర్ర‌టి ఎండ‌ను సైతం ప్ర‌జ‌లు లెక్క చేయ‌కుండా అభిమాన నేత వెంట అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. 
Back to Top