ప్రజా నాయకుడు వస్తున్నాడనే ఆశ


  • అందుకే వెయ్యి కిలోమీటర్లకు ప్రాముఖ్యత
  • వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
నెల్లూరు:
దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ఒక ప్రజా నాయకుడు వస్తున్నాడనే ఆశ
ప్రజల్లో పెరిగిపోయిందని, అందుకే ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్ల
మైలురాయికి ప్రాముఖ్యత లభించిందని వైయస్‌ జగన్‌మోహన్‌ రాజకీయ వ్యవహారాల
కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు
నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న సజ్జల మీడియాతో
మాట్లాడారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి
ఇచ్చాపురం వరకు తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి
చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ సర్కార్‌కు సమాధి కట్టాలనే ఆలోచన
జనతాల నుంచి వస్తుందని, మొత్తం దోచుకుని జనాలా నోట్లో మట్టి కొట్టే పాలనపై
ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా
వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందని, పార్టీ కంటే ముందు మేం సిద్ధంగా ఉన్నామని
ప్రజలు కూడా సంకేతాలు ఇస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజల సమస్యలను
తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ కమిటీలను వేశారని,
త్వరలో కులవృత్తులపై కూడా ఒక కమిటీని వేసి వారి సమస్యలను
తెలుసుకోనున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజల నుంచి
తెలుసుకున్న సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లనున్నామని
చెప్పారు.
Back to Top