పెండింగ్‌ పనుల కోసం వైయస్‌ఆర్‌సిపి ర్యాలీ

విశాఖపట్నం, 2 మార్చి 2013: విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మధ్యలోనే ఆగిపోయిన కోట్లాది రూపాయల విలువైన పెండింగ్ పను‌ల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కదం తొక్కింది. పెండింగ్‌ పనులను వెంటనే పూర్తిచేయాలంటూ వైయస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో శనివారంనాడు విశాఖనగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విశేఖ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ఫ్లై ఓవర్ పనులు, రహదారుల నిర్మాణం, అండ‌ర్ డ్రైనై‌జ్ పనులు పూర్తిచేయడంలో‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ పనులను ‌తక్షణమే పూర్తిచేసేందుకు నడుంబిగించాలని వారు డిమాండ్ చేశారు.
Back to Top