వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను వేధించడం తగదు: పెద్దిరెడ్డి

చిత్తూరు: వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను  వేధించడం టీడీపీ నాయకులకు, అధికారులకు తగదని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా ఆయన రొంపిచెర్ల మండలంలోని గానుగచింత, మోటుమల్లెల, పెద్దమల్లెల గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పథకాలలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అధికారులు టీడీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.  ఇది మంచి పద్ధతి కాదని హితవుపలికారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను వేధిస్తే అదే రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. గ్రామాల్లో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల పింఛన్ల తొలగింపు సంబబు కాదన్నారు. పింఛన్లు కోల్పోయిన బాధితుల పక్షాన పోరాడుతామని తెలిపారు. బీసీ, ఎస్సీ ఎస్టీ రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలకు అధికారాలు ఇవ్వడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా అధికారులు టీడీపీ నేతల భజన మానుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
Back to Top