<strong>వైయస్‌ఆర్‌సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్</strong><strong>తాడిపత్రిలో నియోజకవర్గంలో ఉద్రిక్తత</strong>అనంతపురంః తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ చేశారు. ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముచ్చుకోట నుంచి పెద్ద వుప్పూరు వరుకు పాదయాత్రకు పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. పాదయాత్రకు పోలీసులు నిరాకరించారు భారీ ఎత్తులన పోలీసు బలగాలు మోహరించి వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి అరెస్ట్ పట్ల వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఖండించారు.పెద్దారెడ్డి మాట్లాడుతూ వప్పురూకు 30 సంవత్సరాలుగా నీరు విడుదల చేయడం లేదని, నీరు విడుదల చేస్తే 20 గ్రామాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. జేసీ సోదరులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. స్వార్థ ఓటమి భయంతోనే పోలీసులను అడ్డంపెట్టుకుని జేసీ సోదరులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ ఆరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. <br/><br/>