పార్టీ శాసనసభా డెప్యూటీ ఫ్లోర్‌లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాతో పాటు ప్రకాశం జిల్లాకు, రాయలసీమకు ఉపయోగం లేదని తాము స్పష్టం చేశామని తెలిపారు. వ్యవసాయ సంఘాలు, నీటిపారుదల రంగ నిపుణులు కూడా పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెబుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టి ఆదాయం కోసం పట్టిసీమను నిర్మిస్తున్నారని మండిపడ్డారు. టెండరు ధర కంటే 20 శాతం అదనంగా చెల్లించి ముడుపులు పొందుతున్నారని విమర్శించారు. పోల వరం ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని దెబ్బతీయటానికే పట్టిసీమను తెరపైకి తెచ్చారని తెలిపారు.