పార్టీని బలోపేతం చేద్దాం: వంగవీటి రాధా

విజయవాడ, 3 సెప్టెంబర్ 2012 : వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ని బలోపేతం చేయడానికి మనమంతా కలిసి కృషి చేద్దామని ఆపార్టీ నేత వంగవీటి రాధా పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌రాజశేఖరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా విజయవాడ మామిడి మార్కెట్లో అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, వైద్య శిబిరాలను రా‌ధా ప్రారంభించారు. సత్యనారాయణపురం ఆర్సిఎం చర్చి సెంటర్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ పార్టీల‌ నాయకులు, కార్యకర్తలు సుమారు రెండు వందల మంది వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. వారికి రాధా వైయస్‌ఆర్ సీపీ కండు‌వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top