ఇదేమైనా బాబూ ఇంటి వ్యవహారమా..?

  • మూడున్నరేళ్లయినా ఫైనలైజ్ కాని డిజైన్లు
  • రాజధాని ముసుగులో విపరీతమైన అవినీతి
  • ప్లానింగ్ లేకుండా దుబారా ఖర్చులు
  • ఇంకా ఎంతకాలం బాబూ నీ మోసాలు
  • సిగ్గు, శరం లేకుండా రాజాధాని కావాలంటే బాబు రావాలంటారేమో
  • చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పార్థసారధి

  • హైదరాబాద్ః  మూడున్నరేళ్లయినా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంకా డిజైన్లు ఫైనలైజ్ చేయలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను ఇంకా ఎంతకాలం  మోసం చేస్తారు బాబూ..? అంటూ నిప్పులు చెరిగారు. రాజధాని అమరావతికి  వైయస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని అన్నారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతినే తాము నిలదీస్తున్నామన్నారు.  తాము అధికారంలోకి వస్తే రాజధానిని నిర్మించడానికి కావల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టి ఆర్థిక, సామాజిక ప్రపంచస్థాయి నగరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారే. మీరు ఇప్పటివరకు ఎన్నివేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మాణం చేశారని పార్థసారధి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో మూడున్నరేళ్లు పూర్తయింది. న్యాయ, ఆర్థిక, అడ్మినిస్ట్రేటివ్ నగరాలని కడతామని చెప్పారు. ఒక్కటైనా కట్టాగలిగారా బాబూ..?  ఒక ప్లానింగ్ లేకుండా దుబారా ఖర్చులు చేస్తున్నారంటూ టీడీపీ సర్కార్ పై పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 90వేల కోట్ల అప్పుంటే దాన్ని బాబు రూ. 2 లక్షల 25వేల కోట్లకు పెంచారు తప్ప ఆయన వచ్చి సాధించిందేమీ లేదని పార్థసారధి విమర్శించారు.  
    ప్రజల కోసం  స్వార్థం లేకుండా త్వరగా రాజధానిని నిర్మించాలని డిమాండ్ చేశారు.

    నార్మన్ పోస్టర్లు , మాకీ సంస్థలు, ఈశ్వరన్ సింగపూర్ వాళ్లంతా రాజధాని కట్టడం కోసమా..? లేక ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదో చేస్తున్నామని భ్రమను కల్పిస్తున్నారా బాబూ..?  దసరానాడు శంకుస్థాపన చేస్తామంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ఆహ్వానిస్తాం. అంతేగానీ ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఆకృతుల కోసం వెంపర్లాడుతున్నారు. ప్రపంచంలోని లేని ఆకృతులు...ఆర్థికంగా అత్యంత బలమైన దేశాలు కూడ ఆలోచించని ఆకృతుల గురించి ఆలోచిస్తున్నాకు. కట్టండి. కానీ ఆర్థిక పరిస్థితులేమిటి. దసరా నాటి నుంచి చిత్తశుద్ధితో మీరు నిర్మాణం ముందుకు తీసుకెళ్లాలనుకుంటే బడ్జెట్ లో ఎంత కేటాయించారు. కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. జీతాలిచ్చేందుకు, పెన్షన్లు ఇచ్చేందుకే డబ్బులు లేవని ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నారని...మరి  డైమండ్ ఆకారం అసెంబ్లీ , స్థూపాకృతి హైకోర్టు కోసం మీరు చేస్తున్న ఖర్చు ఎంత ..? ఎంత నిధులు కేటాయిస్తున్నారని నిలదీశారు. డిజైన్లు ఫైనలైజ్ కాకపోవడానికి చంద్రబాబు  స్వార్థపూరిత అవినీతి ఆలోచనలు, అసమర్థతే కారణమని అన్నారు. 

    పేదలు చదువుకునే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు మాత్రం ఎత్తేస్తూ.. హెల్త్, ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొచ్చి రాజధానిలో విలువైన వందల ఎకరాలను కేటాయించడమేనా రాజధాని అభివృద్ధి అంటే..? ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించరు. రూపాయి కేటాయించరు. ప్రైవేటు వాళ్లకు అప్పనంగా భూములిచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టిస్తారు. ఎయిమ్స్ అన్నారు. మూడున్నరేళ్లయింది ఇంతవరకు అతీగతీ లేదు. రాష్ట్రాన్ని ప్రపంచబ్యాంకుకు తాకట్టుపెట్టి ప్రభుత్వ సంస్థలను అమ్మేసి చంద్రబాబు తన జేబులు నింపుకుంటున్నాడని పార్థసారధి ఫైర్ అయ్యారు. దేశం మొత్తం మీద 1999 నుంచి 2004 మధ్య 108 సంస్థలను అమ్మేస్తే ఒక్క ఏపీలోనే 58 సంస్థలను బాబు అమ్మేశాడు. రాష్ట్రాన్ని కూడా ఆలోచన చేస్తున్నావా బాబూ..? ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు. పేదవాడికి ఒక్క సెంటు ఇచ్చి ఇళ్లు కట్టిస్తానని ఏనాడైనా నమ్మకాన్ని కలిగించావా..?  మధ్యతరగతి ప్రజలకు కేపిటల్ లో 100 ఎకరాల్లో గృహవసతి ఏర్పాటు చేస్తానని నమ్మకాన్ని కల్పించలేకపోయావు. 

    నార్మన్ పోస్టర్స్ డిజైన్ నచ్చక రాజమౌళికి అప్రూవల్ కోసం పంపుతారట. రాష్ట్రం ఎటుపోతుంది. భూమికి సంబంధించిన విషయాల్లో రెవన్యూ మంత్రి, ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఆర్థికమంత్రి, అధికారులు ఇన్వాల్వ్ కాకుండా.....చంద్రబాబు, లోకేష్ ఫైనలైజ్ చేయడమేంటి. ఇది బాబు ఇంటి వ్యవహారమా..? ఎందుకు అందరినీ ఇన్ వాల్వ్ చేయడం లేదు. లోకేష్ , నార్మన్ పోస్టర్ టూర్ చేయాల్సిన అవసరం ఏంటి. సీనియర్ మంత్రులు, అధికారులు, కేంద్ర మంత్రులతో డిస్కస్ చేయకుండా లోకేష్ తో  నార్మన్ డిస్కస్ చేయడమేంటి. 2018 కల్లా మొదటి దశ రాజధాని పూర్తిచేస్తామని చెప్పారు. నీళ్లు కారే తాత్కాలిక భవనాలు తప్ప ఏంచేశారు. ఏమీ కట్టడం చేతగాక నాకు మళ్లీ ఐదేళ్లు అవకాశం ఇస్తే కడతానని బాబు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జాబు కావాలంటే బాబు కావాలన్నాడు. రాజధాని కావాలంటే బాబు కావాలి అనే నినాదాన్ని కూడ సిగ్గు శరం లేకుండా తీసుకొస్తారేమో. చిత్తశుద్ధితో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా. అన్ని రంగాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండే నగరాన్ని ఏర్పాటు చేయాలి. కేంద్రంతో మీ లాలూచీ, అగ్రిమెంట్ ఏంటి...?రాజధానికి  ఎంత ఖర్చు చేస్తారో స్పష్టం చేయాలని పార్థసారధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార
Back to Top