పంటలను పరిశీలించిన షర్మిల

సి.బెళగల్ 18 నవంబర్ 2012 : 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా ఆదివారం షర్మిల కోడుమూరు నియోజక వర్గం పరిధిలోని సి.బెళగల్‌లో పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పత్తి, శెనగ పంటలను పరిశీలించిన షర్మిల రైతుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలోలాగే కిరణ్ ప్రభుత్వానికి కూడా రైతు లంటే చిన్నచూపని ఆమె విమర్శించారు. వైయస్ ఉండి ఉంటే వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంటు వచ్చి ఉండే దన్నారు. జగనన్న సిఎం అయ్యాక వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చేయడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా జగన్ ఏర్పాటు చేస్తారన్నారు. వయోధికులైన మహిళలతో మాట్లాడుతూ షర్మిల వారికి పెన్షన్లు వస్తున్నయో లేదో వాకబు చేశారు. అసలు పెన్షన్లన్నవే ఎరుగమని వారిలో కొందరు షర్మిలతో వాపోయారు. ఈ విషయమై ఆమె తన వెంట ఉన్న స్థానిక నాయకులకు కొన్ని సూచనలిచ్చారు. పాదయాత్రలో పాల్గొంటున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజన రంగారావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

Back to Top