వైయ‌స్సార్సీపీ వెబ్ సైట్ లో క‌ర‌ప‌త్రం

విజ‌య‌వాడ‌) గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి సంబంధించిన క‌ర‌ప‌త్రం పార్టీ అధికారిక వెబ్ సైట్ http://www.ysrcongress.com/ లో ఉంచ‌డ‌మైన‌ది. తాజా వార్త‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అందించే న్యూస్ అప్ డేట్స్ విభాగం ప‌క్క‌నే దాన్ని అందుబాటులో ఉంచారు. అక్క‌డ నుంచి పార్టీ నాయ‌కులు డౌన్ లోడ్ చేసుకొనేవీలుంది.  విజ‌య‌వాడ‌లో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఈ క‌ర‌ప‌త్రాన్ని విడుద‌ల చేశారు. పార్టీ నియోజ‌క వ‌ర్గాల కోర్డినేట‌ర్ల సార‌థ్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయస్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ అధ్య‌క్షులు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు ప్ర‌తీ ఇంటికి త‌ర‌లి వెళ‌తారు. అక్క‌డ ఈ క‌ర‌ప‌త్రాన్ని అందించి ఆ ఇంటిలోని వారి అభిప్రాయాలు తెలుసుకొంటారు. త‌ర్వాత వారి అభిప్రాయాల‌కు అనుగుణంగా ప్ర‌శ్న‌లు అందించి జ‌వాబులు కోర‌తారు. క‌ర‌ప‌త్రం చివ‌ర స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించేందుకు ఏర్పాటు చేశారు. వీటిని భారీ సంఖ్య‌లో ముద్రించి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లకు అందించ‌టం జ‌రిగింది. 
Back to Top