పాలు పితికి.. మిషన్ కుట్టి..

మహబూబ్‌నగర్:

మరో ప్రజా ప్రస్థానం ముపై ఏడో రోజున మహానేత కుమార్తె షర్మిల ప్రజలలో మరింతగా కలిసిపోయారు. స్థానిలకులను ఆశ్చర్యచకితులను చేశారు. శుక్రవారం కలుగొట్ల నుంచి ప్రారంభమైన యాత్ర పోతులపాడు గేటు మీదుగా బొంకూరుకు చేరింది. కలుగొట్ల గ్రామంలో వేరుశనగ రైతులను, పత్తి రైతులను కలిసి షర్మిల వారి సమస్యలు తెలుసుకున్నారు. బొంకూరులో నల్లాల వద్ద బిందెలు పెట్టుకుని నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్న మహిళలను పలకరించారు. వారం రోజులకు ఒకసారి నీళ్లు వదులుతారనీ, తాగడానికి నీళ్లు లేవనీ  వారామెకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి చంద్రశేఖర్ నగర్, శ్రీనివాస నగర్ మీదుగా కలుకుంట్ల చేరుకున్నారు. అక్కడ స్థానిక మహిళలతో కలిసి కుట్టు మిషన్ కుట్టారు. గేదె పాలు పితికారు. అక్కడి నుంచి రాత్రి 7.40కు బూడిదపాడు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు. శుక్రవారం 14.50 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 492.40 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

యాత్రకు నేతల సంఘీభావం
     
     షర్మిల యాత్రలో శుక్రవారం వేలాది మంది ఆమె వెంట నడిచి సంఘీభావం తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు, నేతలే కాకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కె. శ్రీనివాసులు, మాజీ మంత్రి కొండా సురేఖ, పార్టీ నేతలు వై.వి. సుబ్బారెడ్డి, కె.కె. మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సంకినేని వెంకటేశ్వరరావు, బాల మణెమ్మ, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, జిట్టా బాలకృష్ణారెడ్డి, డి. భాస్కర్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కుమార్ యాదవ్, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి తదితరులు షర్మిల వెంట నడిచారు.

Back to Top