పాదయాత్రలో నేడు రెండు బహిరంగ సభలు

కర్నూలు:

మహానేత తనయ వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం 35వ రోజుకు చేరుతుంది. సెయింట్ క్లార్కు స్కూలు నుంచి యాత్ర బయలుదేరుతుంది. సల్కాపూర్ గ్రామంలో షర్మిల రచ్చబండలో పాల్గొంటారు. బళ్ళారి జంక్షన్ తరవాత  చెన్నమ్మ సర్కిల్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కృష్ణనగర్ వరకూ నడిచిన తరవాత మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటారు. మసీదు సెంటర్, గాయత్రి ఎస్టేట్ రోడ్, కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కాలేజీ గేట్, బుధవారపేట, కల్లూరి వంతెన, వన్ టౌన్ పోలీసు స్టేషన్, పూల బజార్, పెద్దమార్కెట్, పాత బస్సుస్టాండు వరకూ వెడతారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పోలీస్ లైన్, ప్రకాశ్ నగర్ దాటిన తరవాత సెయింట్ జోసెఫ్ కళాశాలలో రాత్ర బస చేస్తారు. బుధవారం ఆమె మొత్తం 12 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురామ్ ఓ ప్రకటనలో వివరించారు.

Back to Top