పాదయాత్రకు వెల్లవలా జనం

మహబూబ్‌నగర్:

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో తమ పార్టీ అరవై నుంచి డెబ్బై సీట్లు గెలుచుకుంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది వైయస్ రాజశేఖరరెడ్డేనని ఆయన పేర్కొన్నారు. షర్మిల తెలంగాణలో చేస్తున్న పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారని చెప్పారు. పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోందని జిట్టా తెలిపారు.  పాదయాత్రలో ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, కె.కె. మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Back to Top